FbTelugu

దుర్గగుడిలో 13 మంది ఉద్యోగులు సస్పెన్షన్

విజయవాడ: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో 13 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. మూడు రోజుల ఏసీబీ సోదాల్లో ఉద్యోగుల అవినీతి అక్రమాలు వెలుగుచూశాయి.
మూడు రోజుల పాటు నిర్వహించిన సోదాల్లో ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి, ఎవరు పాత్రదారులు, ఎంత మేరకు జరిగిందనే దానిపై పూర్తి నివేదికను ఏసీబీ అధికారులు రూపొందించి రాష్ట్ర దేవాదాయ కమిషనర్ కు అందచేశారు. ఏసీబీ నివేదిక ఆధారంగా దేవాదాయశాఖ కమిషనర్ సస్పెన్షన్ ఆదేశాలిచ్చారు. అన్నదానం, టికెట్ల అమ్మకాలు, చీరల విభాగాల్లో అక్రమాలపై నివేదిక జరిగినట్లు తేల్చారు. మొత్తం 7 విభాగాల్లోని ఐదుగురు సూపరింటెండెంట్లు, 8మంది సిబ్బంది సస్పెన్షన్ అయ్యారు.
ఏసీబీ సోదాలతో బదిలీ వేటు నుంచి తప్పించుకునేందుకు ఆలయం ఈఓ సురేష్ విశాఖపట్నం శ్రీ శారదా పీఠం వెళ్లారు. శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సులు తీసుకుని వచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.