FbTelugu

ఎస్ఈసీ జాయిట్ డైరెక్టర్ పై వేటు

* తన సెలవులతో ఎన్నికలకు విఘాతమంటూ ఆరోపణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయిప్రసాద్‍పై ఎస్‍ఈసీ వేటు వేసింది. తాను 30 రోజులపాటు సెలవుపై వెళ్లడమే కాకుండా ఇతర ఉద్యోగులను సైతం సెలవుపై వెళ్లేలా ప్రభావితం చేశారని సాయిప్రసాద్‍పై ఆరోపణలున్నాయి.

ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అతని చర్యలను క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణించింది. ప్రస్తుత ఎన్నికలకు విఘాతం కలిగించేలా అతని చర్యలు ఉన్నాయని ఆర్టికల్ 243 రెడ్ విత్, ఆర్టికల్ 324 ల ప్రకారం విధుల నుంచి తొలగిస్తున్నట్టు పేర్కొంది. అలాగే అతను మరే ఇతర ప్రభుత్వ సర్వీసులలో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ విధులు నిర్వహించడానికి వీల్లేదన్న ఎస్‍ఈసీ స్పష్టం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.