FbTelugu

నూతన సిఈసిగా సుశీల్ చంద్ర

న్యూఢిల్లీ: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఈసి) గా సీనియర్ కమిషణర్ సుశీల్ చంద్ర నియమితులు అయ్యారు. ప్రస్తుత ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా పదవీ కాలం ముగియడంతో సుశీల్ ను నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

సుశీల్ చంద్ర 1980 బ్యాచ్ కు చెందిన ఐఆర్ఎస్ అధికారి. ఎన్నికల కమిషనర్ గా నియమించక ముందు ఆయన సిబిడిటి ఛైర్మన్ గా పనిచేశారు. పన్నులు, వసూళ్లలో విచారణ అనుభవం ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ గా నియమించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.