FbTelugu

 సుశాంత్ అప్ డేట్స్: నటి రియాకు సమన్లు

ముంబై: సీబీఐ అధికారులు నటీ రియా చక్రవర్తి, ఆమె తండ్రి సమన్లు జారీ చేశారు. ఇవాళ మరోసారి సుశాంత్ స్నేహితులు సిద్ధార్థ పితానిని విచారించనున్నారు. ముంబైలోని డీఆర్ డీఓ గెస్టు హౌస్ లో సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు.

సుశాంత్ బ్యాంక్ ఖాతా నుంచి సుమారు రూ.15 కోట్ల వరకు రియా చక్రవర్తి ఖాతాలకు వెళ్లాయని తండ్రి కెకె.సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే. తన కుమారుడి డబ్బులు తీసుకోవడంతో పాటు ప్రాణాన్ని కబలించిందనే ఆరోపణలు ఉన్నాయి. సుశాంత్ వంట మనిషి నీరజ్ ను కూడా మూడు రోజులుగా విచారిస్తున్నారు. ఇంటికి ఎవరెవరు వచ్చేవారు, ఏం మాట్లాడేవాడు, వారితో ఎలాంటి సంబంధాలు ఉండేవని వాంగ్మూలం తీసుకుంటున్నారు.

You might also like