FbTelugu

సుశాంత్ సూసైడ్ ఎప్పటికీ మిస్ట‌రీయేనా!

చంద్రుడిపై వెళ్లాల‌ని ఆశ‌ప‌డ్డాడు. న‌టుడ‌య్యాక‌.. త‌న క‌ల‌ను నెర‌వేర్చుకునేందుకు ఎంతోమంది విద్యార్థుల‌ను చ‌దివిస్తున్నాడు.

చంద్రుడిపై సీ ఆఫ్ మాస్కోవిలో ప్లాట్ కూడా కొన్నాడు. 14 ఎల్ ఎక్స్ అనే శ‌క్తివంత‌మైన టెలిస్కోప్ సాయంతో ప్లాట్‌ను చూసి సొంతం చేసుకుని ఫిదా అయ్యాడు. ఇది బాలీవుడ్ న‌టుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పూత్ గురించి తెలిసిన వాస్త‌వం. ఖ‌రీదైన కార్లు… అంత‌కు మించి తాను ఇష్ట‌ప‌డే స్పోర్ట్స్ బైక్‌లు ఎన్నో త‌న ఇంట్లో వున్నాయి. ఒక్కో సినిమాకు రూ.5-6కోట్లు పారితోషికం తీసుకునే న‌టుడుగా ఎదిగాడు.

బుల్లితెర నుంచి వెండితెర‌కు ఎదిగాడు. యావ‌త్ దేశవ్యాప్తంగా అభిమానుల‌కు సొంతం చేసుకున్నాడు. 34 ఏళ్ల వ‌య‌సుకే ఇంత‌మంచి గుర్తింపు తెచ్చుకోవ‌టం ఖాన్‌ల‌కు న‌చ్చి ఉండ‌క‌పోవ‌చ్చు. పైగా అక్క‌డంతా హీరోయిజ‌మే పెత్త‌నం చేస్తుంది. క‌నీసం తెలుగు సినీ రంగంలో నిర్మాత‌ల హ‌వా ఉంటుంది. కానీ.. అదంతా ముంబయి మాఫియా చేతిలో ఉండే చిత్ర‌ప‌రిశ్ర‌మ‌. నాటి రాజ్‌క‌పూర్ నుంచి అమితాబ‌చ్చ‌న్ వ‌ర‌కూ ప్ర‌తి ఒక్క‌రూ ఏదోక స‌మ‌యంలో మాఫియా నుంచి బెదిరింపులు చ‌విచూసిన‌వారే ఉన్నారు.

అక్క‌డ ఎద‌గాలంటే.. మాఫియాకు క‌మీష‌న్లు.. వారు చెప్పిన నిర్మాత‌ల‌కు కాల్‌షీట్లు ఇవ్వాలి. కూడ‌బెట్టిన సొమ్ములో వాటా త‌ప్ప‌నిస‌రి. 1991 నాటి బాంబుపేలుళ్ల కుట్ర‌లో సంజ‌య్‌ద‌త్ కూడా ఇరుక్కుని జైలు జీవితం గ‌డిపాడు. దావూద్‌తో ప‌రిచ‌యం.. డ్ర‌గ్స్ విక్ర‌యాల‌తో అల‌నాటి అందాల తార మోనికాబేడీ కూడా బేడీలు వేయించుకుంది. అటువంటి హిందీ రంగ‌స్థ‌లంపై గ్రూపులు త‌క్కువేం కాదు. ఇప్పుడు అక్క‌డ అమీర్‌ఖాన్‌, స‌ల్మాన్‌ఖాన్‌, షారుక్‌ఖాన్‌ల త్ర‌య‌మే న‌డిపిస్తుంది. సినిమా విడుద‌ల కావాల‌న్నా వారి మాటే చెల్లుబాటు కావాలి.

ఇపుడిపుడే ఎదుగుతున్న సుశాంత్‌సింగ్ రాజ్‌పూత్ కూడా ఈ సాలెగూటి నుంచి త‌ప్పించుకోలేక‌పోయాడు. అదే స‌మ‌యంలో మాజీ ప్రేయ‌సి పెళ్లి. మాజీ మేనేజర్ ఆత్మ‌హ‌త్య మ‌రింత కుంగ‌దీశాయి. లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లు.. ఎప్పుడో విడుద‌ల కావాల్సిన సినిమా రిలీజ్‌పై అనుమానాలు. న‌లువైపుల ప‌డుతున్న రాళ్లదాడి నుంచి త‌ప్పించుకోలేక‌పోయాడు. ఎంతో దృఢంగా మ‌న‌సు కూడా ఇక నావ‌ల్ల కాద‌ని ఎదురుతిరిగి ఉండ‌వ‌చ్చు. చేతిరాత‌, ట్వీట్ట‌ర్ ఖాతా అన్నింటి తాను డిప్రెష‌న్‌తో ఎంతగా బాధ‌ప‌డుతున్నాన‌ని చెప్పాడు.

అలా బ‌య‌ట‌కు పంచుకోవ‌టం ద్వారా ఎంతోకొంత భారం త‌గ్గించుకుందామ‌ని ఆశ‌ప‌డిఉంటాడు. కానీ.. అప్ప‌టికే ప‌రిస్థితులు ప్ర‌తికూలంగా మారాయి.. దీనివెనుక హిందీ సినిమా పెద్ద‌లు ఉన్నారంటూ నెపోటిజం అనే మాట‌ను తెర‌మీద‌కు తెచ్చారు. ఆధిప‌త్యం చాటుకునేందుకు జ‌రిపే దాడుల్లో సుశాంత్ బ‌లయ్యాడంటూ ఫైర్‌బ్రాండ్ కంగ‌నార‌నౌత్ బ‌హిర్గతం చేసేంత వర‌కూ ఎవ్వ‌రూ నోరెత్తలేదు. కానీ ఇపుడిపుడే బాలీవుడ్‌లో అణ‌చ‌బ‌డిన నోళ్ల‌న్నీ మౌనాన్ని వీడుతున్నాయి. ఇదంతా బావోద్వేగంతో పెల్లుబుకే నిర‌స‌న‌గా చ‌ప్పున చ‌ల్లారుతుందా.. సుశాంత్ మ‌ర‌ణానికి కార‌ణాల‌ను అన్వేషించి క‌ట్ట‌డి చేసేందుకు పునాది అవుతుందా అనేది మాత్రం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.