FbTelugu

సుశాంత్ అభిమాని ఆత్మహత్య

లక్నో: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇక లేరనే వార్తను అభిమానులు ఇప్పటికి మరువలేకపోతున్నారు.

ఆయన మరణాన్ని తట్టుకోలేక గ్రేటర్ నోయిడాకు చెందిన పన్నెండు సంవత్సరాల బాలుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరో తరగతి చదువుతున్న బాలుడు సుశాంత్ సింగ్ కు అభిమాని. చనిపోయిన దగ్గర నుంచి బాలుడు అన్యమనస్కంగా ఉంటున్నాడు.
సుశాంత్ ఇక లేడనే వార్తతో మనోవేదనకు గురైన బాలుడు శనివారం తన గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు అభిమన నటుడి వార్తలే వీక్షించాడు. అంతకు ముందు సుశాంత్ మరణ వార్త తట్టుకోలేక విశాఖపట్నంలో ఒఖ అమ్మాయి, ఒడిశాలో మరో అమ్మాయి బలవన్మరణానికి పాల్పడ్డారు.

You might also like