FbTelugu

సుశాంత్, సారా అలీ గాఢ ప్రేమికులు: శామ్యూల్ వెల్లడి

ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్, నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. బాక్సాఫీసు వద్ద సోన్ చిరియా ప్లాప్ కావడంతో సారా మొహం చాటేసిందని సుశాంత్ స్నేహితుడు శామ్యూల్ హోకిప్ ఇన్‌స్టాగ్రామ్ లో తెలిపాడు.

సుశాంత్ మరణంపై పలు రకాల వాదనలు తెరమీద ఉన్నాయి. ఈ కేసును సీబీఐ విచారిస్తున్నది. ఈ నేపథ్యంలో శామ్యూల్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కేదార్ నాథ్ చిత్రంలో సుశాంత్, సారా లు కలిసి నటించారని, ఆ సమయంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. ప్రమోషన్ సమయానికి పెళ్లి చేసుకునే స్థాయికి వెళ్లింది. సుశాంత్ తరువాతి చిత్రం సోని చిరియా బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టింది. ఈ చిత్రం ఫ్లాప్ కావడంతో సారా అలీ ఖాన్ దూరం జరిగి తెగదెంపులు చేసుకున్నది. ఈ విషయం తెలిసి నేను కూడా షాకు కు గురయ్యానని శామ్యూల్ తెలిపాడు. సోన్ చిరియా అట్టర ప్లాప్ కావడానికి బాలీవుడ్ మాఫియానే కారణమని శామ్యూల్ తన ఇన్‌స్టాగ్రామ్ లో వెల్లడించాడు.

You might also like