FbTelugu

సూర్య విరాళం రూ.5 కోట్లు

చెన్నై: కరోనా కారణంగా వీధిన పడిన సినీ కార్మికులను ఆదుకునేందుకు హీరో సూర్య మరోసారి దయాగుణం నిరూపించుకున్నారు. ఇప్పటికే ఒకసారి విరాళం ప్రకటించిన ఆయన మరోసారి రూ.5 కోట్లు ప్రకటించి శెహబాష్ అనిపించుకున్నారు.
లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తేసినప్పటికీ సినిమా షూటింగ్ లు ఆశించిన విధంగా జరగడం లేదు. అక్కడక్కడ మినహా ఎవరూ షూటింగ్ లు చేసే సాహసం చేయడం లేదు.

ఒకప్రాంతంలో షూటింగ్ ప్రారంభిస్తే కనీసం వంద మందికి తక్కువ కాకుండా పనిచేయాల్సి ఉంటుంది. జనం ఎక్కువ కావడం, భౌతిక దూరం కారణంగా నిర్మాతలు వెనక్కి తగ్గుతున్నారు. ఫలితంగా ఈ రంగంపై ఆధారపడిన వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.

పూట గడవడం గగనంగా మారిన పరిస్థితుల్లో తనవంతుగా రూ.5 కోట్లు విరళం ఇస్తున్నానని, భవిష్యత్తులో కూడా సాయం చేస్తానని సూర్య హామీ ఇచ్చారు. కష్టకాలంలో ఎందరో తనకు అండగా నిలిచారని, తప్పని పరిస్థితుల్లో డిజిటల్ మీడియా లో సినిమాను రిలీజు చేస్తున్నానని సూర్య తెలిపారు.

You might also like