FbTelugu

తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా ఆవరించి ఉంది. అదేవిధంగా ఛత్తిస్ గఢ్ పరిసర ప్రాంతాల్లోనూ ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉంది.

అయితే రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ, రేపు వడగాలులు వీస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లోనూ ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

You might also like