FbTelugu

రేవంత్ సభలో వైఎస్ఆర్ అనుచరుడు సూరీడు

రంగారెడ్డి: రావిర్యాలలో రేవంత్ రెడ్డి నిర్వహించిన రాజీవ్ రైతు రణభేరీ సభలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి వ్యక్తిగత సహాయకుడు సూరీడు కన్పించాడు. ఎంపీ రేవంత్ రెడ్డితో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు.

ఎవరూ ఊహించని విధంగా సూరీడు హాజరుక కావడంతో సభకు వచ్చిన ప్రజలు ఆశ్చర్యపోయారు. సూరీడు రాక సరికొత్త చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పనిచేసిన సమయంలో సూరీడు వ్యక్తిగత సహాయకుడుగా పనిచేశారు. వైఎస్ఆర్ మరణించిన తరువాత రాజకీయాలకు, మీడియాకు దూరంగా ఉంటున్న సూరీడు రేవంత్ సభకు రావడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది.

గతంలో వైఎస్ఆర్ పాదయాత్రకు అనుమతి లేదన్నారు..

ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్.రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిన సందర్భంలో సీనియర్లు అడ్డంకులు సృష్టించారని మాజీ మంత్రి కొండా సురేఖ తెలిపారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ సీనియర్లు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని చూశారని ఆమె గుర్తు చేశారు. ఆ పెద్ద మనుషులే ఈరోజు రేవంత్ రెడ్డి సభపై మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. కేసీఆర్ ను గద్దె దించేందుకు మనందరం కలిసికట్టుగా పోరాడాలని సురేఖ పిలుపునిచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.