FbTelugu

నూతన సాగుచట్టాల అమలుపై సుప్రీం స్టే

* కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తీవ్రంగా ఆందోళనలు చేపడుతున్న తరుణంలో సుప్రీం వ్యాఖ్యలు కీలకంగా మారాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే ఈ సాగు చట్టాల అమలుపై స్టే ప్రకటించారు.

కొత్త సాగు చట్టాలపై ఏం జరుగుతోందో కేంద్రం గుర్తిస్తోందా ? ఈ చట్టాలపై రాష్ట్రాలు తిరగబడుతున్న విషయం మీకు తెలుసా అంటూ కేంద్రాన్ని నిలదీసింది. సుప్రీంకు వచ్చిన ఇన్ని పిటిషన్లలో ఒక్క పిటీషనైనా కొత్త సాగు చట్టాలు అనుకూలంగా ఉందా అంటూ ప్రశ్నించింది. కొత్త సాగు చట్టాలపై ఓ కమిటీ వేయాలని సుప్రీం కోర్టు పునరుద్ఘాటించింది.
కమిటీ సలహా ఇస్తే ఈ సాగు చట్టాల అమలును నిలిపివేయడానికి కూడా తాము సిద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.