FbTelugu

వ్యాక్సిన్ కొనుగోళ్ల పై కేంద్రానికి సుప్రీం షాక్

న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటి వరకు ఎన్ని రకాల వ్యాక్సిన్లు ఎన్ని డోసులు కొనుగోలు చేశారు, వాటికి సంబంధించిన వివరాలు అందచేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

కరోనా నియంత్రణ చర్యలపై ఇవాళ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సుమోటోగా విచారించింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్-వి డోసులు ఎన్ని కొనుగోలు చేశారు, ఏయే రోజు కొనుగోలు చేశారనేది వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. దేశంలో ఇప్పటి వరకు ఎంత మందికి సింగిల్ డోసు ఇచ్చారు, ఎవరికి డబుల్ డోసు ఇచ్చారనేది కూడా తెలియచేయాలని సూచించింది. వీరు మినహాయించి దేశ ప్రజలందరికీ ఎప్పటిలోగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా ఇస్తున్నారా లేదా అనే దానిపై వివరాలతో కూడిన అఫిడవిట్ ను దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.