FbTelugu

పూరి రథయాత్రకు సుప్రీం పచ్చజెండా

ఢిల్లీ: ఒడిశాలోని పూరి జగన్నాథుడి రథయాత్రకు సుప్రీంకోర్టు అనుమతించింది. భక్తులు లేకుండా, అతి తక్కువ సంఖ్యలో జనం ఉండేలా రథయాత్ర జరుపుకోవాలని ఆదేశించింది.

అయితే వేడుక నిర్వహణకు పలు నిబంధనలు విధించింది. యాత్ర నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని ఒడిశా తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే సుప్రీంకోర్టుకు తెలిపారు. కోర్టు అనుమతించడంతో మంగళవారం నాడు జగన్నాథ రథయాత్రను నిర్వహించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.