FbTelugu

హక్కుల కమిషన్ పై రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

Supreme-Notices-to-States-on-the-Rights-Commission

ఢిల్లీ: రాష్ట్రాల్లో సమాచార హక్కు కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కేంద్రంతో పాటు 9 రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. కొన్ని రాష్ట్రాలు నిర్ణీత గడువులోపు సమాచార హక్కు కమిషనర్లను నియమిస్తుండగా, మరికొన్ని రాష్ట్రాల్లో నియామకాలు జరగడం లేదు. తెలంగాణలో ఇద్దరు కమిషనర్లను మాత్రమే నియమించి వదిలేశారు. కమిషనర్ల నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లిప్తంగా ఉన్నాయంటూ సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. కేసును విచారించిన సుప్రీంకోర్టు సమాచార హక్కు కమిషన్ లో కమిషనర్ పోస్టుల ఖాళీలపై నాలుగు వారాల్లో వివరాలు సమర్పించాలని ఆదేశించింది. మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, ఒడిశా, పశ్చిమబెంగాల్, గుజరాత్, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

You might also like