FbTelugu

రఘురామ కేసులో సుప్రీం కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ: నరసాపురం వైసిపి ఎంపి కె.రఘురామ కృష్ణమ రాజు బెయిల్ పిటీషన్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ లోని మిలిటరీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.

సుప్రీంకోర్టులో ఇవాళ రఘురామ కృష్ణమ రాజు బెయిల్ పిటీషన్ పై వాదోపవాదాలు ముగిశాయి. ఏపిలో నిర్వహించే వైద్య పరీక్షలపై తమకు నమ్మకం లేదని, హైదరాబాద్ లో పరీక్షలు నిర్వహించాలని పిటీషనర్ తరఫు న్యాయవాది ఆదినారాయణ రావు వాదించారు. వాదనలు విన్న తరువాత తీర్పును మధ్యాహ్నానికి వాయిదా వేసింది. ఎంపి రఘురామకు సికింద్రాబాద్ లోని ఆర్మీ హాస్పిటల్ లో ముగ్గురు వైద్యులతో ఏర్పాటు చేసిన బోర్డుతో వైద్య పరీక్షలు చేయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి సమక్షంలో వైద్య పరీక్షలు వీడియోగ్రఫీ చేయించి, నివేదికను సీల్డు కవర్ లో అందచేయాలని సూచించింది. జ్యూడిషియరీ అధికారి ని ఏపి హైకోర్టు కాకుండా తెలంగాణ హైకోర్టు నియమించాలని షరతు విధించింది. ఎంపి కి వై కేటగిరీ భద్రత కొనసాగాంచలని, వైద్య పరీక్షల కాలాన్ని జ్యుడిషియల్ కస్టడీగా పరిగణించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ ఆదేశాలను ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు అమలయ్యేలా చూడాలని, తదుపరి విచారణ 21వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.