ఢిల్లీ: కోర్టులో న్యాయవాదులు, న్యాయమూర్తులు నల్లకోటులు ధరించడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో కరోనా పూర్తిగా తగ్గేవరకు లేదా తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు నల్లకోటు ధరించాల్సిన అవసరం లేదని తెలిపింది.
వాటికి బదులు నెక్ తో కూడిన తెల్ల షర్ట్ ధరించాలని తెలిపింది. వైద్యుల సూచనల మేరకే.. నల్లకోట్ల ద్వారా కరోనా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.