FbTelugu

నిమ్మగడ్డ కేసులో స్టేకు సుప్రీం నిరాకరణ

న్యూఢిల్లీ: నిమ్మగడ్డ కేసులో ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. నిమ్మగడ్డ వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిరాకరించింది.

ఈ సందర్భంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను వారంలో లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. నిమ్మగడ్డను ఎస్ఈసీ గా కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే.

You might also like