FbTelugu

సుప్రీంకు వెళ్లిన ఏపీకి చుక్కెదురు

నాలుగు వారాల్లో రంగులు తొలగించాలంటూ ఆదేశం
న్యూఢిల్లీ: హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్లిన ఏపీ ప్రభుత్వానికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చిందని.. గ్రామ పంచాయతీ కార్యాలయాల రంగులను నాలుగు వారాల్లోగా తొలగించాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏపీ పిటిషన్ ను జస్టిస్ లావు నాగేశ్వర్ రావు తో కూడిన ధర్మసనం డిస్మిస్ చేసింది.

ఈ సందర్భంగా నాలుగు వారాల్లోగా పంచాయతీ రంగులను తొలగించకపోతే కోర్ట్ ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ధర్మసనం హెచ్చరించింది. దీనికి సంబంధించి రెండు పేజీల్లో తన తీర్పును బెంచ్ వెల్లడించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.