FbTelugu

సుప్రీం తీర్పు వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ: జీవిఎల్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల రంగుల విషయంలో ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అని బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా రాష్ట్రం.. నా ఇష్టం అన్న విధంగా వ్యవహరిస్తే వైఎస్సార్సీపీ

ప్రభుత్వానికి ఇలాంటి ఎదురుదెబ్బలు తప్పవని హెచ్చరించారు. జగన్ సర్కారు జగమొండి విధానాలు వదులుకోవాలని హితవు పలికారు. నిమ్మగడ్డ రమేష్ విషయంలో కూడా హైకోర్టు ఆదేశాలను ఇప్పటివరకూ అమలు చేయలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం దూకుడు తగ్గించుకొని నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రజల జీవితాల్లో రంగులు నింపాలి కానీ ప్రభుత్వ కార్యాలయాలకు రంగులేయడం కాదన్నారు.

You might also like