FbTelugu

సుదర్శన్ టీవీపై భగ్గుమన్న సుప్రీంకోర్టు

ఢిల్లీ: సుదర్శన్ టీవీ పై దేశ అత్యన్నత న్యాయస్థానం తీవ్రంగా మొట్టికాయలు వేసింది. యూపీఎస్సీ జిహాద్ అనే కార్యక్రమాన్ని తక్షణం ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది.
సుదర్శన్ టీవీ దేశానికి హానికరం అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. మీడియా స్వేచ్ఛ పేరుతో ఎలా పడితే అలా వ్యవహరిస్తామంటే కుదరని స్పష్టం చేసింది.

యూపీలోని నోయిడా లో సుదర్శన్ టీవీ శాటిలైట్ ఛానల్ ప్రధాన కార్యాలయం ఉంది. ఇక్కడి నుంచి ప్రసారాలు జరుగుతాయి. ముస్లిం మైనారిటీ వ్యతిరేక కథనాలను వండి వార్చుతూ వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది. ఈ మధ్య ఒక ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. యూపీఎస్సీ జిహాద్ పేరిట రూపొందించిన ప్రత్యేక కథనంలో ముస్లింలు యూపీఎస్సీ సాధించడం కుట్రగా నిందించింది.
దేశంలో అత్యున్నత సంస్థ ప్రతిష్ట దెబ్బతినేలా సుదర్శన్ టీవీ వ్యవహరించడాన్ని ఖండించింది. అదే పనిగా కృత్రిమంగా వడ్డించే ఇలాంటి కథనాలు దేశానికి హానికరమని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ కథనం యూపీఎస్సీకి మచ్చ తెచ్చే విధంగా ఉందని, వెంటనే ప్రసారాలు నిలిపివేయాలంటూ మాజీ ఐఏఎస్ అధికారులు అమితాబ్ పాండే, నవ్ రేఖా శర్మలు సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు పై విధంగా వ్యాఖ్యలు చేసింది.

You might also like