FbTelugu

క్యాస్ట్… నవనీత్‌ కు సుప్రీంలో ఊరట

న్యూఢిల్లీ: అమరావతి లోక్‌సభ ఎంపి, సినీ నటి నవనీత్‌ కౌర్‌ రాణాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.

ఈ నెల 8న బాంబే హైకోర్టు నవనీత్‌ కౌర్‌ ఎస్సి కుల ధృవీకరణ పత్రం రద్దు చేయడంతో పాటు నకిలీ పత్రాలు సమర్పించినందుకు గాను ఆమెకు రూ.2 లక్షల జరిమానా విధించగా, ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆమె దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై మంగళవారం జస్టిస్‌ వినీత్‌ శరన్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి నేతృత్వంలోని వెకేషన్‌ బెంచ్ విచారణ జరిపింది. మహారాష్ట్రతో పాటు ఆమెపై న్యాయస్థానంలో పిటిషన్‌ వేసిన ఆనంద్‌రావు అద్సులేకు నోటీసులు జారీచేసింది. గత పార్లమెంటు ఎన్నికల్లో ఆనంద్ రావు ఆమె పై పోటీ చేసి ఓడిపోయారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.