FbTelugu

దేశం అల్లకల్లోలంగా ఉంది: సుప్రీంకోర్టు

కరోనాపై జాతీయ విధానం రూపొందించాలి

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పరిస్థితి అల్లకల్లోలంగా మారిందని. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం చోద్యం చూడడం సరికాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ.బోబ్డే మండిపడ్డారు.

దేశంలో పరిస్థితి చూస్తుంటే నేషనల్ ఎమర్జెన్సీని తలపించేలా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తో మందుల కొరత, వ్యాక్సినేషన్, రాష్ట్రాలకు లాక్ డౌన్ విధించే అధికారం వంటి ప్రధాన అంశాలపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు గా స్వీకించింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. దేశంలోని పలు ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరతపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. దీంతో పాటు కరోనా మందుల కొరతపై కూడా కేంద్రాన్ని వివరాలు అడిగింది. నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. కరోనా సంసిద్ధతపై వివరాలు అందచేయాలని, రేపటి లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

లాక్ డౌన్ విధించే అధికారం రాష్ట్రాలకు ఉండదా అని ప్రశ్నించింది. లాక్ డౌన్ విధించే అధికారం రాష్ట్రాలకు కట్టబెట్టే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పింది. పలు రాష్ట్రాల హైకోర్టులలో కరోనా పాజిటివ్ పై నమోదు అయిన కేసులను సుప్రీంకోర్టుకు బదలాయిస్తామని తెలిపింది. ఆక్సిజన్, మందుల సరఫరా పై జాతీయ విధానం ఉందా అని అడిషనల్ సొలిటర్ జనరల్ తుషార్ మెహతా ను నిలదీసింది. ప్రధానంగా నాలుగు అంశాలపై విచారించిన సుప్రీంకోర్టు ప్రభుత్వ చర్యలపై విస్మయం వ్యక్తం చేసింది. కరోనా కేసుల్లో సలహాదారుడిగా (అమికస్ క్యూరీ) సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే ను సుప్రీంకోర్టు నియమించింది. ఈ అంశాలపై రేపు కూడా విచారిస్తామని సుప్రీంకోర్టు కేసును వాయిదా వేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.