FbTelugu

సుప్రీంలోనూ జగన్ కు చుక్కెదురు

ఢిల్లీ: మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో మరోసారి ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు అయ్యింది.

రమేష్ కుమార్ పునర్నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ కేసులో ఏపీ ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్నికల కమిషనర్ తొలగింపులో ప్రభుత్వ ఉద్దేశం సరిగా లేదని ధర్మాసనం తప్పుపట్టింది. తుది  విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

సుప్రీంకోర్టు తీరుతోనైనా కళ్లు తెరవాలి…

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రమేష్ పునర్నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సహకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సూచించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి స్టే ఇచ్చేందుకు నిరాకరించిందన్నారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను ప్రభుత్వం గౌరవించాలని, రాజ్యాంగబద్ధ సంస్థల్ని కాపాడాలని  రామకృష్ణ కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.