FbTelugu

లాక్ డౌన్ విధిస్తారా? లేదా?: కేంద్రానికి సుప్రీం సూచన 

 న్యూఢిల్లీ: దేశంలో సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ సుప్రీంకోర్టు లాక్ డౌన్ విధింపుపై కీలక వ్యాఖ్యలు చేసింది. మహమ్మారి కరోనా వ్యాప్తి కట్టడికి లాక్ డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

కరోనా పాజిటివ్ రోగులకు ఆక్సిజన్ ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఢిల్లీలో ఈ అర్థరాత్రి కల్లా ఆక్సిజన్ కొరత తీర్చాలని, ఇకనుంచి సమస్య రాకుండా చూడాలని కేంద్రానికి స్పష్టం చేసింది. కరోనా రోగులను ఆస్పత్రిలో చేర్చుకునే విషయమై వేర్వేరు రాష్ట్రాల్లో భిన్నమైన నిబంధనలు ఉన్నాయని, ఇలా కాకుండా దేశ వ్యాప్తంగా ఒకే రకమైన విధానాన్ని రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. దేశ వ్యాప్తంగా ఒకే రకమైన నిబంధనల కోసం రెండు వారాల గడువు విధిస్తున్నట్లు తెలిపింది.

దేశంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లు, జన సమూహ కార్యక్రమాలు, సూపర్‌ స్ప్రెడర్‌ ఈవెంట్లపై నిషేధం విధించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సెకండ్‌ వేవ్‌ విజృంభణ నేపథ్యంలో ప్రజా సంక్షేమం దృష్ట్యా త్వరితగతిన చర్యలు చేపట్టాలని కోరింది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించినట్లయితే వలస కార్మికులు సహా ఇతర బడుగు జీవులు ఇబ్బందులు పడకుండా వారి కోసం తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.