FbTelugu

ఆక్సిజన్ పై రంగంలోకి దిగిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: కరోనా రోగులకు ఆక్సిజన్ సరిపడా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందడంతో సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. రోగులకు ఆక్సిజన్ సక్రమంగా సరఫరా చేసేందుకు 12 మంది సభ్యులతో నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ మెడికల్ ఆక్సిజన్ ను మదింపు చేయడంతో పాటు పంపిణీ బాధ్యతలను పర్యవేక్షిస్తుంది.

గ్రామీణ ప్రాంతాలకు అత్యవసర మందులు, వైద్య సిబ్బంది వంటి అంశాలపై సేవలు అందిస్తుంది. నేషనల్ టాస్క్ ఫోర్స్ లో 10 మంది వైద్యులు, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. కేంద్ర కేబినెట్ సెక్రెటరీ కమిటీ కన్వీనర్ గా వ్యవహరించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివై.చంద్రచూడ్ ధర్మాసనం ఆదేశించింది. దేశంలోని పలు ఆసుపత్రులలో పనిచేసిన, పనిచేస్తున్న వైద్య నిపుణులను సభ్యులుగా నియమించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.