ఢిల్లీ: సుప్రీంకోర్టులో దమ్మాలపాటి శ్రీనివాస్ కేసు విచారణ ప్రారంభం అయ్యింది. అశోక్ భూషన్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది.
ఈ కేసు లో ఏపీ హైకోర్టు స్టే ను రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. అమరావతి భూ కుంభకోణం కేసులో దమ్మాలపాటి శ్రీనివాస్ సహా 13 మంది నిందితులపై ఏపీ అవినీతి నిరోధక శాఖ కేసులు నమోదు చేసింది. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. కాగా ఏసీబీ కేసు దర్యాప్తుపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది కేసు వివరాలు మీడియాలో రిపోర్ట్ చేయొద్దని గ్యాగ్ ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసిందే.