FbTelugu

ఏపీ హైకోర్టు కు షాక్ ఇచ్చిన సుప్రీం

ఢిల్లీ: అమరావతి భూ కుంభకోణం కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ కు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది.

రాజధాని భూ కుంభకోణం కి సంబంధించి వివరాలు ఎందుకు వెల్లడి కావొద్దు? అని ప్రశ్నించింది. నేరం జరిగితే విచారణ జరపాల్సిన అవసరం లేదా అని అడిగింది. దర్యాప్తు, మీడియా రిపోర్టింగ్ ఏదీ వద్దా ? అని అనుమానం వ్యక్తం చేసింది. పిటిషనర్ అడగకుండానే ఇలాంటి ఆర్డర్లు ఎలా ఇస్తారు?. దమ్మాలపాటి పిటిషన్ వేస్తే 13 మందికి ఎలా వర్తింపజేస్తారు?. దమ్మాలపాటి సహా 13 మందికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది.
గ్యాగ్ ఆర్డర్ ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. తదుపరి విచారణ జనవరి చివరికి వాయిదా వేసింది. అప్పటివరకు కేసు ఫైనల్ చేయవద్దని హై కోర్టు కి సుప్రీం ఆదేశాలు ఇచ్చింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.