FbTelugu

ఎంతమందినైనా కనొచ్చు… సుప్రీంలో కేంద్రం

న్యూఢిల్లీ: పాత రోజుల మాదిరి భార్యాభర్తలు ఇక నుంచి ఎంతమందినైనా కనవచ్చని, ఆంక్షులు ఏమీ పెట్టడం లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

కుటుంబ నియంత్రణ పాటించాలని దేశ ప్రజలను బలవంతం పెట్టడలేమని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. సంతానంపై నిబంధనలు పెడితే ప్రజల నుంచి నిరసనలు వచ్చే ప్రమాదముందని తెలిపింది. తమకు ఎంతమంది సంతానం కావాలో దంపతుల ఇష్టమని, కుటుంబ నియంత్రణపై ఎలాంటి వత్తిడి చేయలేమని కేంద్రం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. కుటుంబ నియంత్రణపై బలవంతపు చర్యలను తాము వ్యతిరేకిస్తున్నామని పేర్కొంది. నిర్ధిష్ట సంఖ్యలో పిల్లలను కనాలని నిబంధనలు పెడితే అది ప్రజల నుంచి వ్యతిరేకత మొదలై ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదముందని గతానుభవాలను కేంద్రం వెల్లడించింది.

దేశంలో జనాభా నియంత్రణకు చర్యలు చేపట్టేలా, ఇద్దరికి మించి పిల్లలను కనకుండా నిబంధనల తీసుకువచ్చేలా ఆదేశాలివ్వాలని బీజేపీ నాయకుడు, అడ్వకేట్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం పై విధంగా అఫిడవిట్ దాఖలు చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.