FbTelugu

జైనుల పూజలకు సుప్రీంకోర్టు అనుమతి

ఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో సుప్రీంకోర్టు జైనులకు తీపి కబురు చెప్పింది. ముంబై నగరంలో మూడు జైన దేవాలయాల్లో పూజలు చేసుకునేందుకు అనుమతినిచ్చింది. పర్యూషన్ ఉత్సవాల సందర్భంగా ప్రార్థనలకుకూడా పచ్చజెండా ఊపింది.

గణేష్ ఉత్సవాలకు అనుమతిచ్చే విషయంపై మహారాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ నుంచి వచ్చే సమాధానం బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ.బాబ్డే ధర్మాసనం ప్రకటించింది.

జైన దేవాలయాలను తెరవకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున జోక్యం చేసుకోలేమని ముంబై హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై జైనులు సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు.

You might also like