FbTelugu

స్టెరిలైట్ తెరిచేందుకు అనుమతి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: కరోనా విపత్కర పరిస్థితుల్లో రోగులను ఆదుకునేందుకు స్టెరిలైట్ ఇండస్ట్రీని తెరిచేందుకు అనుమతించాలని వేదాంత లిమిటెడ్ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.

ఈ పిటీషన్ పై విచారించిన ధర్మాసనం ఆక్సిజన్ కోసం స్టెరిలైట్ తెరిచేందుకు అనుమతించింది. కరోనా కేసులు అధికంగా ఉన్నందున కేవలం ఆక్సిజన్ మాత్రమే ఉత్పత్తి చేయాలని జస్టిస్ వైవి.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఈ అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి రాజకీయ విమర్శలు చేసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.