FbTelugu

14 రకాల పంటలకు మద్దతు ధర పెంపు!

ఢిల్లీ: వచ్చే సీజన్ లో పలు రకాల పంటలకు మద్దతు ధర పెంచుతూ ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మంత్రి మండలిలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్ ఇవాళ వెల్లడించారు.

2020-21 మార్కెటింగ్ సీజన్‌లో మద్దతు ధరలను 50 శాతం నుంచి 83 శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు. 14 రకాల ఖరీఫ్ పంటలకు ఇది వర్తించబోతుందని ఆయన తెలిపారు. వరి క్వింటాల్ కు రూ.1,868, హైబ్రిడ్ జొన్నకు రూ.2,620(100 కేజీలకు), మొక్కజొన్నకు రూ.1,850(100 కేజీలు), ప్రొద్దు తిరుగుడుకు రూ.5885(100 కేజీలకు), కందిపప్పుకు రూ.6000(100 కేజీలకు), సజ్జలకు రూ.2,150 మద్దతు ధరగా ఉండబోతున్నట్లు పేర్కొన్నారు. రైతులు వ్యవసాయం, అనుబంధం కోసం తీసుకున్న స్వల్పకాలిక రుణాల గడువు పెంచుతామని, ఆగష్టు వరకు పొడిగించే వెసులుబాటు కల్పించామన్నారు.

You might also like