FbTelugu

మహిళా ఖైది కోసం వ్యాక్సిన్లు సరఫరా?

జేరుసలేం: తమ దేశానికి చెందిన మహిళా ఖైదీని శత్రు దేశం నుంచి విడిపించుకునేందుకు ఏకంగా కరోనా వ్యాక్సిన్లను ఉచితంగా పంపించింది. ఆమె కోసం రెండు దేశాలు రహస్యంగా ఒప్పందం చేసుకున్నా సమాచారం లీక్ అయి ప్రపంచానికి తెలిసిపోయింది.
ఇజ్రాయెల్, సిరియా దేశాల మధ్య ఎప్పటి నుంచో శత్రుత్వం ఉంది. ఒకదేశం అంటే మరో దేశానికి పొడ గిట్టదు. సిరియాకు వ్యాక్సిన్ ను ఇజ్రాయెల్ సమకూర్చుతున్నదని వార్తలు రావడంతో పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. ప్రతికూల ఇరానీ శక్తులకు శత్రు దేశం ఆతిథ్యమిస్తోందని ఆరోపిస్తున్నారు.

సిరియాకు ఇజ్రాయెల్ కు చెందిన మహిళ అనుకోకుండా వెళ్లి చిక్కుకున్నది. ఆమెను వెనక్కి రప్పించడానికి రష్యాను మధ్వవర్తిత్వ ప్రతినిధిగా రంగంలోకి దించింది. దీనికి బదులుగా ఇజ్రయెల్ లో బందీలుగా ఉన్న ఇద్దరు గొర్రెల కాపరులను సిరియాకు అప్పగించింది. ఇదే కాకుండా రష్యా దేశం తయారు చేసిన స్ఫత్నిక్ వీ వ్యాక్సిన్ ను కూడా సరఫరా చేశారు. అయితే ఈ వ్యాక్సిన్ ను నేరుగా పంపించకుండా రష్యా ప్రభుత్వం ద్వారా పంపించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ రెండు దేశాలు ఒప్పందంపై నోరు మెదపడం లేదు. సుమారు 1.2 మిలియన్ డాలర్ల విలువైన వ్యాక్సిన్ సిరియాకు పంపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.