FbTelugu

మూఢనమ్మకం… ఒంటె తల నరికాడు

జైపూర్: ప్రపంచంలో ఇంత మార్పు వస్తున్నా ఇంకా జనాల్లో మూఢనమ్మకాలు జాడలు మాత్రం పోవడం లేదు. ప్రముఖ పర్యాటక ప్రాంతం ఉదయ్ పూర్ లో మూర్ఖత్వానికి ఒంటె బలైంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
గోవర్ధన్ విలాస్ ప్రాంతంలో రాజేష్ అహిర్ ఆవులు పెంచుతున్నాడు. ఒక ఆవు కొద్ది రోజుల నుంచి సరిపడా పాలు ఇవ్వడం లేదు.

తక్కువగా ఇస్తుండడంతో స్థానికంగా ఉంటున్న చేతన్ అనే యువకుడిని ఆశ్రయించాడు. అతను తన తండ్రి శోభాలాల్ కు పరిచయం చేయగా, పాలు ఇచ్చేలా చూస్తానని హామీ ఇచ్చాడు. స్థానికంగా శోభాలాల్ మంత్ర విద్యల్లో పేరుపొందాడు. ఒంటె తల నరికి దాన్ని ఇంటి గుమ్మం ముందు గోయి తవ్వి పాతిపెడితే ఆవు గతంలో మాదిరే పాలు ఇస్తుందని చెప్పాడు. ఆ ప్రకారంగానే రాజేష్ ఒంటె మెడ నరికి గుమ్మం ముందు పాతి పెట్టాడు. ఒంటె మొండెం ను ఉదయ్ పూర్ ఆవల పడేయంతో పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. దర్యాప్తు చేయగా రాజేష్ చంపినట్లు ఆధారాలు లభ్యం అయ్యాయి. ఒంటెన రాష్ట్ర జంతువు కావడంతో పలు సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మూఢ నమ్మకాల వలలో పడి మూగ జీవి అయిన ఒంటె తలను నరికారని సూరజ్ పోల్ స్టేషన్ ఆఫీసర్ హనుమంత్ సింగ్ రాజ్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.