FbTelugu

సూపర్ స్టార్ మహేష్ బాబు – యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకే వేదికపై

సూపర్ స్టార్ మహేష్ బాబు – యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా సన్నిహితంగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరు ఒకరిపై ఒకరు ప్రత్యేకమైన అభిమానాన్ని చూపిస్తారు. మహేష్ ను ప్రేమగా అన్నయ్య అని పిలుస్తుంటారు తారక్. మహేష్ కూడా ఎన్టీఆర్ పట్ల అదే ప్రేమను కురిపిస్తుంటారు. ఎవరి సినిమా విడుదలైనా ఫోన్ చేసి మరీ ఒకరికొకరు అభినందించుకుంటూ ఉంటారు. సినిమా ఫంక్షన్స్ కు హాజరవడమే కాకుండా.. ఇద్దరి కుటుంబాలు కలసి పార్టీలు కూడా చేసుకుంటారు. అయితే చాలా రోజుల తర్వాత మహేష్ – ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపించబోతున్నారు’ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే క్విజ్ షో కు ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీ గెస్టుగా మహేష్ బాబు హాజరయ్యారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయింది. దీనికి సంబంధించిన ఫోటోలు లీకై సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దసరా లేదా దీపావళి సందర్భంగా ఈ షో ప్రసారం అవుతుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. అయితే త్వరలోనే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుందని నిర్వాహకులు ప్రకటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.