FbTelugu

జగన్ పై సునీల్ వ్యాఖలు సరికాదు: ఎంపి వెంకటేష్

కర్నూలు: బిజెపి ఎపి వ్యవహారాల సహా ఇన్ ఛార్జి సునీల్ దియోధర్ వ్యాఖ్యలను అదే పార్టీకి చెందిన ఎంపి టిజి.వెంకటేష్ ఖండించారు. ఎపి సిఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై సునీల్ దియోధర్ వ్యాఖ్యలు సరికాదన్నారు.

అక్రమాస్తుల కేసులో బెయిల్ పై ఉన్న జగన్ రద్దు చేయాలో లేక వద్దో అనేది కోర్టులు తేలుస్తాయన్నారు. కోర్టు పరిధిలోని అంశాలపై వ్యాఖ్యలు మంచిది కాదని వెంకటేష్ హితవు పలికారు. ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు బహిష్కరిస్తే టీడీపీకే నష్టమన్నారు. భవిష్యత్ లో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకునే ఆలోచన లేదన్నారు. చంద్రబాబు ఎవరినైనా వాడుకుని వదిలేసే రకమని, నైతిక విలువలు లేవని ఎంపి టిజి.వెంకటేష్ వ్యాఖ్యనించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.