FbTelugu

జగన్ పై విరుచుకుపడ్డ సునీల్

తిరుపతి: హిందువులంటే జగన్ కు చిన్నచూపు అని, అన్యమతస్తులను ప్రోత్సహిస్తున్నారని బిజెపి జాతీయ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల సహా ఇన్ ఛార్జి సునీల్ ధియోధర్ విమర్శించారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగన్ ఏ మతమో ప్రజలందరికీ తెలుసు..? అని ఆయన అన్నారు. తిరుపతి వైసిపి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి క్రిస్టియన్ అని, క్రిస్టియన్ అనే ఆధారాలు మా దగ్గర ఉన్నాయన్నారు. ఆధారాలతో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్నికల తర్వాతైనా గురుమూర్తి వ్యవహారం బయటపెడతామన్నారు. రాష్ట్రంలో వైసిపి నేతలు గోవిందనామాలను అపహాస్యం చేస్తారా..? అని మండిపడ్డారు. నన్ను విమర్శించే స్థాయి సమాచార శాఖ మంత్రి పేర్ని నానికి లేదని సునీల్ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.