FbTelugu

విదేశీ చట్టాలను గౌరవిస్తాం: సుందర్ పిచాయ్

వాషింగ్టన్: గూగుల్ సంస్థ స్థానిక ప్రభుత్వ చట్టాలను గౌరవిస్తుందని, వాటికి కట్టుబడి ఉంటుందని ఆ సంస్థ సిఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. రెగ్యులేటరీ విధానాల్లో ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుందని స్పష్టం చేశారు.
భారతదేశంలో బుధవారం నుంచి నూతన ఐటి నిబంధనలు అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. గౌరవిస్తుందా లేదా వ్యతిరేకిస్తుందా అనేదానిపై సందిగ్ధత నెలకొంది. దీనిపై గూగుల్ సిఈఓ సుందర్ పిచాయ్ స్పందించారు. ఆసియా పసిఫిక్ జర్నలిస్టులతో జరిగిన వర్చువల్ సమావేశంలో డిజిటల్ కంటంట్ నియంత్రణ నిబంధనలపై ఆయన వివరించారు. ప్రపంచంలో అనేక దేశాలలో తమసంస్థ కార్యకలాపాలు సాగిస్తున్నది. ప్రతిదేశంలో అక్కడి స్థానిక చట్టాలను, నిబంధనలు తప్పకుండా గౌరవిస్తాం. వారితో కలిసి నిర్మాణాత్మకంగా పని చేస్తామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేసే మార్పులను కూడా మా నివేదికల్లో పొందుపరుస్తామని ఆయన చెప్పారు. ప్రపంచంలో ఏ నియంత్రణసంస్థతోనైనా మేము కలిసి ముందుకు వెళ్తాం. సంపూర్ణ సహకారం అందిస్తామని, న్యాయపరమైన ప్రక్రియలు, విధానాలపై మాకు గౌరవం ఉందని పిచాయ్ తెలిపారు.

భారత ఐటి నూతన నిబంధనలను వాట్సప్ సవాల్ చేస్తూ న్యూఢిల్లీ కోర్టును ఆశ్రయించగా, అమలు చేస్తామని గూగుల్ ప్రకటించడం విశేషం. దీంతో వాట్సప్, కేంద్రం మధ్య వివాదం రాజుకున్నది. కొత్త నిబంధనలు అమలుపరుస్తామని ఫేస్ బుక్ చెప్పిన తరువాత కూడా వాట్సప్ కోర్టును ఆశ్రయించం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంలో వెనక్కి తగ్గేది లేదని, దేశ సౌర్వభౌమత్వం, శాంతి భద్రతల విషయంలో రాజీపడబోమని కేంద్ర ప్రభుత్వం ధీటుగా సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.