FbTelugu

వలసదారుల కృషివల్లే అమెరికా అభివృద్ధి: సుందర్ పిచాయ్

వాషింగ్టన్: వలసదారుల కృషి ఫలితంగానే అగ్రరాజ్యం అమెరికా ఇంతలా అభివృద్ధి చెందిందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు. అమెరికాలో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వలస దారులపై కన్నెర్ర చేశారు. వర్క్ వీసాలు నిలిపివేస్తామంటూ ప్రకటించారు.

ఈ నిర్ణయంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్క్ వీసాలు నిలిపివేయడంపై టెక్ కంపెనీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో వలస ఉద్యోగులకు గూగుల్ అండగా ఉంటుందని గూగుల్ సీఈఓ సందర్ పిచాయ్ ట్విట్టర్ లో తెలిపారు. అమెరికా ప్రతి ఏడాది జారీ చేస్తున్న వీసాల్లో సుమారు 70 శాతం హెచ్1బీ వీసాలు భారతీయులే పొంతున్నారు.

You might also like