FbTelugu

సన్ బాత్… అది కన్పించడంతో పరుగో పరుగు

సౌత్ వేల్స్: సన్ బాత్ చేద్దామని సౌత్ సిడ్నీవాసులు ఇద్దరు తమ దగ్గర్లోని బీచ్ కు మధ్యాహ్నం వెళ్లారు. నగ్నంగా ఒడ్డున కూర్చుని ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తుండగా వారి ఎదురుగా దుప్పి కన్పించింది. ఇంకేముంది పరుగో పరుగు.
దాన్నించి తప్పించుకునేందుకు రాయల్ నేషనల్ పార్కులోకి వెళ్లారు. అయినా తరుముతుండడంతో ఆయసపడ్డ ఇద్దరూ చేసేది లేక చెట్లెక్కారు.

సన్ బాత్ కు వెళ్లిన వాళ్లు రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రంగా గాలించి ఇద్దరి వ్యక్తులను పోలీసులు కనిపెట్టగలిగారు. రక్షించండంటూ కేకలు వేయడంతో తప్పించుకున్న వ్యక్తులు వీరేనని నిర్థారణకు వచ్చారు. వారిని రక్షించి క్షేమంగా ఇంటికి చేర్చాడు. ఇలాంటి మూర్ఖులను ఎలాంటి చట్టాలతో అడ్డుకోవాలో అర్థం కావడం లేదని సోత్ వేల్స్ పోలీసు కమిషన్ మిక్ పుల్లర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి సన్ బాత్ ఛేసిన ఇద్దరిపై 760 డాలర్ల ఫైన్ విధించారు. కరోనా కట్టడి చేసేందుకు లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.