FbTelugu

గూగుల్, ఫేస్ బుక్ కు సమన్లు

న్యూఢిల్లీ: దేశంలో ఆన్ లైన్ మీడియా, సోషల్ మీడియా దుర్వినియోగం పై కట్టడి చర్యలు ప్రారంభమయ్యాయి. పౌరుల హక్కుల పరిరక్షణ పై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఫేస్ బుక్, గూగుల్ కు సమన్లు జార చేసింది.

త్వరలో యూ ట్యూబ్ ఇతర ఫ్లాట్ ఫాం లకు కూడా నోటీసులు ఇవ్వనున్నారు. సమన్లలో పేర్కొన్న విధంగా అంశాలపై చర్చించేందుకు ఈ నెల 29వ తేదీన రావాల్సిందిగా రెండు సంస్థలను ఐటి పార్లమెంటరీ స్థాయి సంఘం కోరింది. ఈ సంఘానికి కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ నేతృత్వం వహిస్తున్నారు. ప్రధానంగా పౌరుల హక్కుల రక్షణ, మహిళలు, చిన్నారుల భద్రత, ఆన్ లైన్ న్యూస్ దుర్వినియోగం అంశాలపై స్థాయి సంఘం వివరణలు తీసుకోనున్నది. ఫేస్ బుక్, గూగుల్ సంస్థల ప్రతినిధులు తమ అభిప్రాయాలను తెలియచేయాలని సమన్లలో కోరింది. ఇదే అంశాలపై మున్ముందు యూ ట్యూబ్, ఇతర సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులకు నోటీసులు పంపించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.