FbTelugu

రైలు దగ్ధం కేసులో కాపు నేతలకు సమన్లు జారీ

తూ.గో.జిల్లా: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాపు ఉద్యమం సందర్భంగా చేసిని రైలు దహనం కేసులో పలువురు కాపు నేతలకు సమన్లు జారీ అయ్యాయి.

కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మానభం ఆధ్వర్యంలో 2016 జనవరి 31న తునిలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆగ్రహానికి గురైన పలువురు కాపు నాయకులు చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను దహనం చేశారు. దీనిపై అప్పట్లో రైల్వే పోలీసులు ముద్రగడ పద్మనాభం తో పాటు మొత్తం 41 మందిపై రైల్వే చట్టంలోని 146, 147, 153, 174 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 41 మంది నిందితులు మార్చి 3న విజయవాడలోని రైల్వే కోర్టుకు హాజరుకావాలని సమన్లలో ఆదేశించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు నమోదు చేసిన కేసులను వైసీపీ ప్రభుత్వం ఎత్తివేయగా రైల్వే కోర్టు సమన్లు జారీ చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.