FbTelugu

ఏపి హైకోర్టుకు 10 నుంచి వేసవి సెలవులు

అమరావతి: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా ఏపి హైకోర్టు, క్రింది కోర్టులకు వేసవి సెలవులు కాస్త ముందుగానే ప్రకటించారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ బుధవారం నాడు నోటిఫికేషన్‌ జారీ చేశారు.

హైకోర్టుకు ఈ నెల 10 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు తెలిపారు. ఇంతకు ముందు ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 14 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో మరో మూడు రోజులు అదనంగా సెలవులు ఇచ్చారు. ఇందుకు బదులుగా అక్టోబర్‌ 23 (శనివారం)తో పాటు సెలవులుగా ప్రకటించి, నవంబర్‌ 3, 5 తేదీలను పనిదినాలుగా పేర్కొన్నారు. మరోవైపు క్రింది కోర్టుల్లోని అన్ని కోర్టులు, సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులకు మే నెల 14 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయని గతంలో ప్రకటించారు. అలా కాకుండా మే నెల 10 నుంచి జూన్‌ 8 వరకు సెలవులు ఇస్తున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.