FbTelugu

విద్యార్థులకు వేసవి సెలవులు

భోపాల్: కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండడంతో మధ్యప్రదేశ్ విద్యాశాఖ అప్రమత్తమైంది. 1నుంచి 8వ తరగతి వరకు రెండు నెలల పాటు వేసవి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది.

విద్యార్థులకు సెలవులు ఇచ్చినప్పటికీ బోర్డ్ పరీక్షలు పూర్తయ్యేంతవరకూ ప్రభుత్వ టీచర్లు ఎవరూ తమ టీచింగ్ హెడ్‌క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ మంత్రి ఇందర్ సింగ్ పర్మర్ తెలిపారు. . విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలకు ఫిబ్రవరి 15 నుంచి జూన్ 13వ తేదీ వరకూ సెలవులను ప్రకటించింది. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆన్‌లైన్ బోధన చేసుకోవచ్చని మంత్రి చెప్పారు. కరోనా కారణంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు విద్యార్థులకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.