FbTelugu

ఇంతకీ నిమ్మగడ్డని ‘ఎస్ఈసీ’గా గుర్తించారా?: సుజనా

అమరావతి: వైసీపీ ప్రభుత్వం ఇంతకీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఎస్ఈసీ (రాష్ట్ర ఎన్నికల కమిషనర్)గా గుర్తించారా అంటూ బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ప్రశ్నించారు. ఈ నెల 13న నిమ్మగడ్డ రమేష్ కుమార్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ ఓ హోటల్ లో రహస్యంగా భేటీ అయ్యారంటూ… రాజ్యాంగ పదవిలో ఉంటూ ఇలాంటి భేటీలేంటని వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

ఈ తరుణంలో సుజనా చౌదరి ట్విట్టర్ లో విమర్శల వర్షం కురింపించారు. రమేష్ కుమార్ ను వైసీపీ ప్రభుత్వమే తొలగించిందని, ఇప్పుడు ఎస్ఈసీగా ఉండి ఎంపీని కలవడమేంటని ఎందుకు ఆశ్చర్యపోతున్నారని ప్రశ్నించారు. కోర్టు ఉత్తర్వులు అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.