FbTelugu

రిపోర్టు రాకముందే భయంతో ఆత్మహత్య

కర్నూలు: ఓ వ్యక్తి కరోనా రిపోర్టు రాకముందే తనకు కరోనా వచ్చిందేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలోని చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. జాకిర్ హుస్సేన్ అనే వ్యక్తి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు.

కాగా వైద్యులు అతనికి కరోనా పరీక్షలు నిర్వహించడానికి అతని నుంచి శాంపిల్స్ ను సేకరించారు. ఈ తరుణంలో తనకు కరోనా వచ్చిందేమోనన్న భయంతో హుస్సేన్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రిపోర్టుల్లో అతనికి కరోనా నెగెటివ్ వచ్చినట్టు తెలిపారు.

You might also like