FbTelugu

చూసేవారు లేక ముగ్గురు వృద్ధుల బలవన్మరణం?

అనంతపురం: పెనుకొండలోని ఒక ఇంట్లో ముగ్గురు వృద్ధుల మృతదేహాలు లభ్యమవడం పట్టణంలోనే సంచలనం సృష్టించింది. కుళ్లిపోయిన స్థితిలో గుర్తుపట్టలేని విధంగా ఉన్న మృతదేహాలను చూసి పోలీసులు షాక్ కు గురయ్యారు.
వేణుగోపాలస్వామి గుడి సమీపంలోని ఒక ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో పక్క ఇంట్లో ఉన్న వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఆలస్యం చేయకుండా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లి చూడగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నమూడు మృతదేహాలను గుర్తించారు. దుర్వాసన రావడంతో బయటకు పరుగులు తీశారు. అశ్వర్థప్ప(80) ఒక బ్యాంకు లో పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయనతో పాటు ఆయన ఇద్దరు చెల్లెళ్లు ఉంటున్నారు. కరోనా సమయంలో ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాకపోవడం, వంట చేసుకునేందుకు శరీరం సహకరించకపోవడంతో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఘటనను బట్టి చెబుతున్నారు. మృతదేహాల పక్కన కీటకాలను చంపేందుకు ఉపయోగించే బాటిళ్లు పడి ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మూడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.