FbTelugu

క్షణికావేశంలో భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం…

విశాఖపట్నం: ప్రేమించి పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న జంట ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. తమకు మూడు నెలల పసికందు ఉన్నదనే విషయాన్ని మరిచి ఈ ఘటనకు పాల్పడడం పలువురిని విస్మయపరుస్తున్నది. ఈ ఘటనలో భర్త చనిపోగా, భార్య అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడుతున్నది.

పోలీసు వెల్లడించిన వివరాల ప్రకారం ప్రకారం.. రోలుగుంట మండలం కుసర్లపూడి గ్రామానికి చెందిన సూదివరపు సురేష్‌ (26), కృపా కమల (23)లు ప్రేమించుకున్నారు. కులాలు వేరైనప్పటికీ పెద్దలను ఎదిరించి ఏడాదిన్నర కిందట వివాహం చేసుకున్నారు. వీరికి మూడు నెలల పసికందు ఉణ్నది. సురేష్‌ గ్రామంలో క్షౌరశాల నిర్వహిస్తున్నాడు. చిన్నపాటి గొడవతో భార్యాభర్తలిద్దరూ శనివారం రాత్రి ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సురేష్‌ చనిపోగా, అపస్మారక స్థితిలో ఉన్న కృపాకమలను నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. మరింత మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. మరో 24 గంటలు గడిస్తే కాని ఏమి చెప్పలేమని వైద్యులు పేర్కొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.