FbTelugu

జబర్దస్త్ నుంచి సుధీర్ టీం అవుట్…

బుల్లి తెర ప్రోగ్రాంస్ లో జబర్ధస్త్..ఎక్స్ట్రా జబర్దస్త్ కు మంచి వ్యూయర్ షిప్ ఉంది. దాదాపుగా తొమ్మిదేళ్లుగా నిరాటకంగా సాగిపోతున్న ఈ కామెడీ ప్రోగ్రాం లో ఇప్పుడు ఒక భారీ కుదుపు కనిపిస్తోంది. జబర్దస్త్ ప్రారంభం లో తొలుత వారానికి ఒక్క రోజు మాత్రమే వచ్చేది. అయితే, పార్టిసిపెంట్స్ ఎక్కువ కావటం… ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావటంతో..దీనికి వారానికి రెండు రోజుల పాటు ప్రసారం చేస్తున్నారు. ఇక, కార్యక్రమం ప్రారంభం నుంచి సుడిగాలి సుధీర్ టీం కీలకంగా ఉంది. ఇప్పుడు ఈ టీం కీలక నిర్ణయం ప్రకటించింది. ముగ్గురూ ఒకటిగా తొలి నుంచి సుడిగాలి సుధీర్.. రాం ప్రసాద్..గెటప్ శ్రీను..సన్నీ కలిసి తమ స్కిట్ లను చేస్తూ వచ్చారు. ఒక దశలో సుధీర్ కు బుల్లితెర రొమాంటిక్ హీరోగానూ పేరు వచ్చింది. ఈ ముగ్గురు పంచ్ లు షో లో ప్రత్యేక ఎట్రాక్షన్. ఇక, సుధీర్ – యాంకర్ రష్మీ మధ్య లవ్ ట్రాక్ సంవత్సరాలుగా కొనసాగుతునే ఉంది. ఇది షో లో మరో స్పెషల్. అయితే, తమకు అన్నం పెట్టింది మల్లెమాల సంస్థ అని..తాము ఎప్పటికీ ఆ టీవీ ఛానల్ కు రుణపడి ఉంటామని ఈ ముగ్గురూ పదే పదే చెప్పారు. అటువంటిది ఈ టీం గురించి కొద్ది రోజులుగా ఒక ప్రచారం సాగుతంది కొంత కాలంగా ప్రచారంలో ఉన్నా దీనిని అటు సంస్థ నిర్వహకులు..ఈ ముగ్గురు సభ్యులు కొట్టిపారేయలేదు..అదే సమయంలో సమర్ధించ లేదు. అయితే, ఈ నెల 10వ తేదీన ప్రసారమయ్చే ఎక్స్ ట్రా జబర్ధస్త్ స్కిట్ కు సంబంధించి ప్రోమోను మల్లెమాల సంస్థ అప్ లోడ్ చేసింది. అందులో ప్రతీ వారం లాగా స్టేజీ మీద కాకుండా..ఈ సారి సహచర పార్టిసిపెంట్స్ ఇళ్లకు వెళ్లి సుడిగాలి సుధీర్ టీం కొంత వెరైటీగా కామెడీ అందించే ప్రయత్నం చేసింది. ఇక, స్టేజీ మీదకు వచ్చిన తరువాత గెటప్ శ్రీను.. సుడిగాలి సుధీర్..ఆటో రాం ప్రసాద్ తాము ఇక నుంచి జబర్దస్త్ లో కంటిన్యూ కావటం లేదని ప్రకటించారు. జబర్దస్త్ వేదికపై నుంచే ప్రకటన ఈ విషయాన్ని తాము ఒక ఇంటర్వ్యూ ఇచ్చి వెల్లడించాలని అనుకున్నామని..అయితే, ఇదే వేదిక నుంచి చెప్పాల్సి వస్తోంది.. జబర్డస్త్ నుంచి వెళ్లిపోవానుకుంటున్నాం.. మమ్మల్ని క్షమించండి అంటూ.. చెప్పుకొచ్చారు. ఆ నిర్ణయం ప్రకటిస్తూనే ఆ ముగ్గురూ కన్నీటి పర్యంతమయ్యారు. ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుంటూ ఉద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయారు. ఈ నిర్ణయాన్ని జడ్జి స్థానంలో ఉంటూ వింటున్న రోజా సైతం కన్నీరు పెట్టారు. అయితే, ఈ ముగ్గురు జబర్దస్త్ వీడుతారని కొంత కాలంగా ప్రచారంలో ఉంది. జబర్దస్త్ తో పాటుగా ఈ ముగ్గురు శ్రీదేవి డ్రామా కంపెనీ ఈవెంట్ లోనూ చేస్తున్నారు. స్పెషల్ ఎట్రాక్షన్ గా మారిన టీం అదే విధంగా పండుగలు.. ప్రత్యేక సందర్బాల్లో నిర్వహించే ఈవెంట్స్ లోనూ ఈ ముగ్గురు ఉంటున్నారు. కానీ, కొద్ది రోజులుగా కొన్ని స్పెషల్ ఈవెంట్స్ లో సుడిగాలి సుధీర్ ను పక్కన పెట్టారు. ప్రతీ గురువారం సీనియర్లతో జబర్దస్త్.. శుక్రవారం జూనియర్లతో జబర్దస్త్ అన్నట్లుగా కార్యక్రమ రూపకల్పన మారినట్లుగా ప్రచారం ఉంది. సీనియర్లుగా ఉన్న తమను జూనియర్లుగా మార్చేయటం.. కొన్ని షోల నుంచి పక్కన పెట్టిన కారణంగానే వారు ఈ నిర్ణయం తీసుకున్నారా అంటూ విశ్లేషణలు మొదలయ్యాయి. జబర్దస్త్ క్రేజ్.. చేతినిండా ప్రెస్టీజియస్ సినిమాలు

You might also like

Leave A Reply

Your email address will not be published.