FbTelugu

మానసిక ఆస్పత్రినుంచి డా.సుధాకర్ డిశ్చార్జ్

విశాఖ: మానసిక ఆస్పత్రినుంచి డాక్టర్ సుధాకర్ ను డిశ్చార్జ్ చేశారు. కోర్టు ఆదేశాలతో సుధాకర్ ను డిశ్చార్జ్ చేసినట్టు అధికారులు తెలిపారు. 19 రోజుల పాటూ సుధాకర్ మానసిక ఆస్పత్రిలో ఉన్నారు. తన కొడుకును డిశ్చార్జ్ చేయాలంటూ డా.సుధాకర్ తల్లి హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.

దీనిపై విచారించిన హైకోర్టు సుధాకర్ ను డిశ్చార్జ్ చేయాలని ఆదేశించింది. అయితే సీబీఐ విచారణకు సహకరించాలని తెలిపింది. డిశ్చార్జ్ అనంతరం.. తన విషయంలో రాజ్యాంగం గెలిచిందని, హైకోర్టు తీర్పు దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడిందని డా.సుధాకర్ అన్నారు.

You might also like