FbTelugu

ఈవి టూ వీలర్ పై సబ్సిడీ పెంపు

న్యూఢిల్లీ: చమురు దిగుమతి తగ్గించుకుని స్వయం సమృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహిస్తున్నారు. ఈవి టూ వీలర్స్ ను మరింతగా ప్రోత్సహించేందుకు ఇప్పుడ ఇస్తున్న సబ్సిడి మొత్తాన్ని రెట్టింపు చేసింది.
సబ్సిడి పెంపుదలతో టూ వీలర్స్ అమ్మకాలు పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ప్రస్తుతం టూ వీలర్ కు ఒక కిలోవాట్ అవర్ సామర్థ్యం ఉన్నట్లయితే తయారీ చేసిన కంపెనీలకు ధరపై 20 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. దాన్ని ఇప్పుడు రెట్టింపు చేసి 40 శాతంగా నిర్ణయించారు. ఒక కిలో వాట్ కు రూ.15వేల సబ్సిడీ ఇస్తుండగా ఇకనుంచి రూ.30 వేలు ఇవ్వనున్నారు. అయితే లక్షన్నర రూపాయలకు మించని టూ వీలర్స్ కు మాత్రమే ఈ సబ్సిడీ వర్తించనున్నారు.

కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై ఈవి టూ వీలర్స్ అగ్రగ్రామి సంస్థ రేట్లకు తగ్గించింది. అథర్ 450 ఎక్స్ మోడల్ పై రూ.14500 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రం నిర్ణయంతో వాహనాల విక్రయం ఊపందుకుంటుంటుదని అథర్ కంపెనీ వ్యవస్థాపకుడు తరుణ్ మెహతా తెలిపారు. కేంద్రం సముచితమైన నిర్ణయం తీసుకున్నదని మరో సంస్థ రివోల్ట్ మోటార్స్ ప్రకటించింది. సబ్సిడీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.10వేల కోట్లు నిధులు ప్రత్యేకంగా కేటాయించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.